In this lesson we are going to Learn Hindi Grammar in Telugu fast .
ఈ లెస్సన్ లో మనం తెలుగు ద్వారా హిందీ గ్రామర్ తెలుసుకోబోతున్నాం .
స్పోకెన్ హిందీ లెసన్స్ తెలుగులో సులువుగా మన వెబ్ సైట్ “ https://haveelaacademy.com “ ద్వారా నేర్చుకొండి .
♦ Learn Hindi Grammar in Telugu ♦
♦ 1. मत ఉపయోగం :
హిందీ భాషలో మత్ (मत ) అనే శబ్దం కాదను సందర్భంలో అంటే వద్దు అనే అర్థంలో వాడతాము.
Example:
तुम मत खाओ = నువ్వు తినవద్దు / నువ్వు తినొద్దు
तुम मत जाओ = నువ్వు వెళ్ళవద్దు
♦ 2. वाला ఉపయోగం :
తెలుగులో వాడు అనే సందర్భంలో वाला అని వాడతాము . అంటే తెలుగులో పాలవాడు , వంటవాడు …. మొదలైనవి . అదే విధంగా वाला అనే విభక్తిని చేర్చి హిందీ లో కొన్ని నామవాచకములకు వాడబడును. అంతేకాకుండా అనేక అర్థములో కూడా వాడుతూ ఉంటారు.
Example:
1. బండి వాడు = गाड़ी वाला
2. ఇంటివాడు = घर वाला
3. పండ్లు అమ్మే వాడు = फल वाला
4. పాలు అమ్మేవాడు = दूध वाला
ఈ విధంగా విశేషణములు బట్టి ( adjective ) वाला , वाली , वाले అను రీతిని आ , ए , ई నియమాలను అనుసరించి వచ్చును.
♦ 3. వచనం ఉపయోగం :
వచనములు రెండు రకాలు అవి … 1. ఏకవచనం 2. బహువచనం
Example :
1. ఏక వచనం —- लड़का
బహువచనం —- लड़के
2. ఏక వచనం —- लड़की
బహువచనం —- लड़कियां
♦ 4. విద్యార్థక క్రియలు ఉపయోగం :
1. విద్యార్థక క్రియలు ఏక వచన రూపంలో వుండు రీతి :
बैठ , उठ , जा … మొదలగు root verbs కు ओ చేర్చినట్లయితే విద్యార్థక పదములు ఏకవచనంలో వుండును.
Example :
बैठ + ओ = बैठो
आ + ओ = आओ
2. విద్యార్థక క్రియలు బహువచన రూపం లో వుండు రీతి :
बैठ , उठ , जा … మొదలగు root verbs కు इये చేర్చినట్లయితే విద్యార్థక పదములు బహువచన రూపం లో వుండును.
Example :
बैठ + इये = बैठिये
आ + इये = आईये
Note :
दे , ले , पी , कर అనే root verbs కు మాత్రం బహువచనంలో इये అనుదానికి బదులుగా जिये అని చేర్చాలి . అంతేగాక ఆ root verbs లోని ఆఖరు ఆక్షరము ई గా మారును .
Example :
दे + जिये = दीजिये ఇదేవిధంగా लीजिये , पीजिये , कीजिये అని బహువచన రూపంలో వచ్చును.
♦ 5. Adjectives – విశేషణములు – विशेषण :
విశేషణము (Adjective) అంటే ఏమిటి ?
విశేషణము అనగా నామవాచకం లేక సర్వనామం యొక్క గుణమును గాని సంఖ్యను గాని పరిమాణం గాని ఫలానా వ్యక్తి లేదా ఫలానా వస్తువు గాని రంగును గాని తెలియజేయు మాటను విశేషణము (Adjective) అంటారు .
♦ 6. Gender – లింగం :
♦ లింగం అంటే ఏమిటి?
స్త్రీ, పురుషుల మధ్య తేడాను గుర్తించే నామవాచక రూపమును లింగం అంటారు.
♦ 7. हूँ / हैं / हो ఉపయోగం :
1. मैं వచ్చినప్పుడు వాక్యము చివర – हूँ రావాలి.
నేను ఉన్నాను – मैं हूँ
2. हम వచ్చినప్పుడు వాక్యము చివర – हैं రావాలి.
మేము ఉన్నాము – हमलोग हैं / हम हैं
3. तुम వచ్చినప్పుడు వాక్యము చివర – हो రావాలి.
నువ్వు ఉన్నావు – तुमलोग हो / तुम हो
4. आप వచ్చినప్పుడు వాక్యము చివర – हैं రావాలి.
మీరు ఉన్నారు – आपलोग हैं / आप हैं
5. वे వచ్చినప్పుడు వాక్యము చివర – हैं రావాలి.
వాళ్ళు ఉన్నారు – वेलोग हैं / वे हैं
6. ये వచ్చినప్పుడు వాక్యము చివర – हैं రావాలి.
వీళ్ళు ఉన్నారు – ये हैं
7. वह వచ్చినప్పుడు వాక్యము చివర – है రావాలి.
అతడు ఉన్నాడు – वह है
8. वह వచ్చినప్పుడు వాక్యము చివర – है రావాలి.
ఆమె ఉంది – वह है
9 . यह వచ్చినప్పుడు వాక్యము చివర – है రావాలి.
ఈమె ఉంది – यह है
♦ 8. Present Tense Question Explanation :
♦ Present Tense Questions లో क्या అనే Question పదంతో వాక్యం మొదలవుతుంది లేదా వాక్యం చివర Helping verb తరువాత అయిన क्या పదం రావచ్చు . ఎలాంటి subject వచ్చినప్పటికీ ఆ subject కి ముందు क्या పదం రావాలి .
నేను ఇక్కడ ఉన్నానా – क्या मैं यहाँ हूँ
For more Details :
My Website : https://haveelaacademy.com/
My YouTube Channel : www.youtube.com/haveelahindi
My First Website : https://paviacademy.com/
How To Learn Hindi Grammar in Telugu .
Thank you for reading this article Hindi Grammar in Telugu . I Hope you liked it. Please Give feedback, comments and share this article.