English Grammar in Telugu

In this lesson we are going to Learn English Grammar in Telugu fast .

English Grammar in Telugu fast – haveelaacademy.com

English Grammar in Telugu fast – haveelaacademy.com

ఈ లెస్సన్ లో మనం తెలుగు ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ తెలుసుకోబోతున్నాం .

స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్స్ తెలుగులో సులువుగా మన వెబ్ సైట్ “ https://haveelaacademy.com “ ద్వారా నేర్చుకొండి .

♦ Learn English Grammar in Telugu ♦

01:

Asking about actions in the past using …. Did.

                            జరిగిపోయిన కాలం లో అంటే భూతకాలంలో ఏం జరిగిందో తెలుసుకొనుటకు మనం ప్రశ్న వేయాలంటే ప్రశ్నను Did తో ప్రారంభించి దాన్ని పక్కన subject (కర్త) ను మరియు verb (క్రియ)ను ఉంచాలి.

Did + subject + present tense verb (v1) + Remaining part

Examples:

1. Did Ravi meet you?

రవి మిమ్మల్ని కలిశారా?

2. Did Haveela meet you?

హవీల మిమ్మల్ని కలిశారా?

3. Did he drive alone?

అతను ఒంటరిగా డ్రైవ్ చేశాడా ?

4. Did he call you?

అతను మిమ్మల్ని పిలిచాడా?

5. Did you sleep well?

మీరు బాగా నిద్రపోయారా?

6. Did you sleep?

నీవు పడుకున్నావా?

7. Did you eat?

నువ్వు తిన్నావా?

8. Did you eat breakfast?

మీరు టిఫిన్ తిన్నారా?

Note : Did తో ప్రారంభించిన వాక్యంలో క్రియ present tense లో అంటే verb 1 ఉండాలి.

2:

a ) Describing the Habitual actions using the simple present tense.

సామాన్య వర్తమాన కాల క్రియలను ఉపయోగించి మనం అలవాటుగా చేసే పనులను తెలియజేస్తుంది .

Examples:

1. I get up at 5 a.m.

నేను ఉదయం 5 గంటలకు లేస్తాను.

2. He drinks milk in the morning everyday

అతను రోజూ ఉదయం పాలు తాగుతాడు.

b ) అలవాటుగా చేసే పనుల విషయాలు తెలుసుకొనుటకు Do తో గాని Does తో గాని ప్రశ్న ప్రారంభిస్తారు.

Examples:

1. Do you see a movie every week?

మీరు ప్రతి వారం ఒక సినిమా చూస్తారా?

2. Does she work?

ఆమె పనిచేస్తుందా?

3. when does Ravi come?

రవి ఎప్పుడు వస్తాడు?

c) Always, sometimes, often ,never, rarely అను పదాలు సంఘటనల కాలవ్యవధిని వివరిస్తాయి.

i) Always : ఎల్లప్పుడు

I always get up early

నేను ఎప్పుడూ ముందుగానే లేస్తాను

ii) never : ఏనాడు కూడా

I never get up late

నేను ఎప్పుడూ ఆలస్యంగా లేవను

iii) sometimes : కొన్నిసార్లు

I sometimes play chess

నేను కొన్నిసార్లు చెస్ ఆడతాను

iv) often : తరచుగా

we all often go on a picnic

మనమందరం తరచుగా విహారయాత్రకు వెళ్తాము

v) rarely : అరుదుగా

They rarely go to picture

వాళ్ళు చాలా అరుదుగా సినిమాకి వెళతారు

3:

Talking about continuous actions in the past using the past continuous tense.

భూత కాలంలో అంటే జరిగిపోయిన కాలంలో ఆగకుండా జరిగే పనులను తెలుపుటకు past continuous tense వాడతారు.

Examples :

నిన్న సాయంత్రం నాలుగున్నర గంటలకు నేను ఆడుతూ ఉన్నాను.

I was playing at four-thirty yesterday evening.

4:

Talking about actions just completed using ….The present perfect tense.

                          Have , has ఉన్న వాక్యాలు Present perfect tense లో ఉన్నాయని చెప్పవచ్చు. అట్టి వాక్యాలు ‘ పని ఇప్పుడే ముగిసింది ‘ అని తెలియజేస్తాయి.

Examples :

1. Ravi has come.

రవి ఇప్పుడే వచ్చాడు అని అర్థం.

2. I have written my letter.

నేను లెటర్ ఇప్పుడే వ్రాసాను.

Note : subject (కర్త) ఏకవచనం అయితే has ను , బహువచనం అయితే have ను ఉపయోగించాలి.

5:

                       ఒక పర్యాయము (once) , రెండు సార్లు (twice) , మూడు సార్లు (thrice), ఏడు సార్లు (seven times) … మొదలగు పదాలు ఎన్ని పర్యాయాలో తెలుపుటకు వాడతారు. వీటిని క్రియా విశేషణాలు అంటారు.

Ex : I visited Delhi twice

నేను రెండు సార్లు ఢిల్లీ సందర్శించాను (చూసాను) .

                    ♦ ఇంతకుముందు మనం have , has ఉన్న వాక్యాలు Present perfect tense కు చెందిన వాక్యాలని తెలుసుకున్నాము. “ఎప్పుడైనా” అని అర్థం వచ్చుటకు Ever +Present perfect tense తో ప్రశ్నలు వేస్తారు.

Ex :

1. Have you ever visited kashi?

మీరు ఎప్పుడైనా కాశీని సందర్శించారా (చూసారా ) ?

2. Has he ever helped you?

అతను నీకు ఎప్పుడైనా సహాయం చేశాడా?

6:

present perfect continuous tense : వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న కాలంలో పని ఎప్పుడో ప్రారంభమై ఇంకా కొనసాగుతున్నట్లయితే Present Perfect Continuous tense లో చెబుతారు .

ex :

I have been doing homework for 2 hours

నేను హోం వర్క్ ను రెండు గంటల నుండి చేస్తూనే ఉన్నాను.

Explanation: రెండు గంటల క్రితం నేను హోం వర్క్ చేయుట మొదలు పెట్టాను . అది ఇంకా కొనసాగుతూనే ఉంది అని అర్థం . ఇచ్చట ఇంకొక ముఖ్య విషయం గమనించండి.

i) she has been cooking for three hours .

ii) They have been constructing the house for seven months.

Explanation: ఇందు “for period of time” తెలుపుతుంది . అనగా కాలవ్యవధిని తెలుపుతుంది . కచ్చితంగా ఎప్పుడు పని ప్రారంభమైందో తెలుపుట లేదు . కాబట్టి period of time చెప్పేటప్పుడు present perfect continuous tense గల వాక్యంలో for ఉపయోగించాలి.

iii) she has been cooking since 8 a.m.

Explanation: ఈ వాక్యంలో since ఉపయోగించటం వల్ల ఖచ్చితంగా కాలాన్ని తెలియజేస్తుంది. అనగా “point of time” ను తెలుపుతుంది . point of time తెలిపేటప్పుడు present perfect continuous tense గల వాక్యాలలో since ఉపయోగించాలి.

7:

asking for duration , using : How long …

ఎప్పటి నుండి అని ప్రశ్నించుటకు How long తో ప్రశ్నను ప్రారంభించాలి.

Ex :

How long have you been working here?

మీరు ఇక్కడ ఎంతకాలం పని చేస్తున్నారు?

8:

                            beg + ar = beggar అయింది. రెండుసార్లు వచ్చింది . ఈ విధంగా ఈ పదాలలో కొన్ని అక్షరాలు రెండు సార్లు వచ్చుటకు ఒక గ్రామర్ రూలు ఉంటుంది . మీరు ఒక పదానికి ఒక syllable కలపవలసి వస్తే పదాంతమున హల్లు వుండి దాని ముందు అక్షరం అచ్చు అయితే పదాంత హల్లును రెండు సార్లు వ్రాయాలి.

Ex : run + ing = running

Explanation: run మూలపదము , చివరి అక్షరం n హల్లు , దాని ముందుది u అచ్చు . ఇట్టి పదానికి ing చేర్చాలి . కాబట్టి n రెండుసార్లు వచ్చింది .

9:

opposites

i) Direct opposites

1. rich (ధనవంతుడు) x Poor (పేద)

2. good (మంచి) x Bad (చెడు)

3. come (వచ్చు) x Go (వెళ్ళు)

4. out (బయట) x In (లోపల)

5. live (జీవించియున్న) x Dead (మరణించిన)

6. clean (శుభ్రంగా) x Dirty (మురికిగా ఉన్న)

7. clever (తెలివైన ) x foolish (తెలివి తక్కువ)

8. begin (ప్రారంభించు) x end (ముగించు)

9. wet (తడిగా ఉన్న) x dry (పొడిగా ఉన్న)

10. easy (తేలికైన) x difficult (కష్టమైన)

11. short (పొట్టి) x tall (ఎత్తయిన)

12. new (కొత్త) x old (పాత)

13. close (మూయు) x open (తెరచు)

14. first (మొదటి) x last (చివరి / ఆఖరి)

15. full (నిండా) x Empty (ఖాళీ)

16. fast (వేగం) x slow (నెమ్మదిగా)

17. cruel (క్రూరమైన) x kind (దయగల)

18. friend (స్నేహితుడు) x foe (శత్రువు)

19. strong (బలమైన) x weak (బలహీనమైన)

20. rough (మొరటు) x smooth (మృదువైన)

21. float (తేలియాడు) x sink (మునిగిపోవు)

22. ugly (అసహ్యమైన) x beautiful (అందమైన)

23. up (పైన) x down (క్రింద)

24. master (యజమాని) x slave (బానిస)

25. never (ఎన్నడును) x always (ఎల్లప్పుడూ)

26. arrival (రాక) x departure (నిష్క్రమణ / పోవడము)

27. hot (వేడిగా ఉన్నా) x cold (చల్లగా నున్న)

28. active (చురుకుగా) x lazy (సోమరిగా నున్న)

29. late (ఆలస్యం) x early (పెందలకడనే)

30. loose (వదులుగా) x tight (బిగువైన)

31. exit (బయటకి దారి) x entrance (ప్రవేశం)

32. wide ( విశాలమైన) x narrow (ఇరుకైన)

33. sarrow (దుఃఖం) x joy (ఆనందం / సంతోషం)

34. natural (సహజమైన ) x artificial (కృత్రిమమైన)

35. true (నిజము) x false (అసత్యమైన)

36. right (సరియైన) x wrong (తప్పు)

37. vice (చెడ్డతనము) x virtue (ధర్మం)

38. ill (అనారోగ్యం / జబ్బు పడిన) x well (బాగుగా నున్న)

39. divide (వేరు చేయు) x join (జత చేయు)

ii) In ను ముందు prefix చేర్చటం వల్ల ఏర్పడే వ్యతిరేక పదాలు

1. decent (మర్యాదగల) x indecent (అమర్యాద తో కూడిన)

2. active (చురుకుగానున్న) x inactive (మందకొడిగా యున్న)

3. accurate (ఖచ్చితమైన) x inaccurate (కచ్చితం కాని)

4. complete (సంపూర్ణ) x incomplete (అసంపూర్ణ )

5. correct (ఒప్పు అయిన) x incorrect (తప్పు అయిన)

6. eligible ( సమర్థత గల) x ineligible (సమర్ధత లేని)

7. discipline (క్రమశిక్షణ) x indiscipline (క్రమశిక్షణ రాహిత్యం)

8. direct (ప్రత్యక్షము) x indirect (పరోక్షము)

iii) un ను ముందు prefix చేర్చటం వల్ల ఏర్పడే వ్యతిరేక పదాలు

1. important (ముఖ్యమైన) x unimportant (ముఖ్యం కాని)

2. able (శక్తి గల) x unable (శక్తిలేని)

3. do (చేయు) x undo (పాడు చేయు)

4. Limited (పరిమితమైన) x unLimited (అపరిమితమైన)

5. natural (సహజమైన) x unnatural (అసహజమైన)

6. comfortable (సుఖమైన) x uncomfortable (సుఖము లేని)

iv) dis ను ముందు prefix చేర్చటం వల్ల ఏర్పడే వ్యతిరేక పదాలు

1. advantage (అనుకూలత) x disadvantage (అనుకూలత లేని)

2. approve (సమ్మతించు) x disapprove (అంగీకరింపక)

3. belief (నమ్మకము) x disbelief (అపనమ్మకం)

4. connect (కలుపు) x disconnect (విడదీయు)

5. appear (కనిపించు) x disappear (అదృశ్యమగు)

6. favour (అనుకూలత) x disfavour (అనుకూలత లేని)

v) mis ను ముందు prefix చేర్చటం వల్ల ఏర్పడే వ్యతిరేక పదాలు

1. manage (నిర్వహించు) x mismanage (నిర్వహించలేని)

2. understand (అర్థం చేసుకొను) x misunderstand (అపార్థం చేసుకొను )

3. Fortune ( అదృష్టం) x misFortune (దురదృష్టం)

vi) less ను చివర suffix చేర్చటం వల్ల ఏర్పడే వ్యతిరేక పదాలు

1. thank (కృతజ్ఞతలతో) x thankless (కృతజ్ఞత లేని)

2. end (సమాప్తం) x endless (అర్థం కాని)

3. aim (గురి) x aimless (గురిలేని)

For more Details :

My Website : https://haveelaacademy.com/

My YouTube Channel : www.youtube.com/haveelahindi

My first Website : https://paviacademy.com/

How to Learn English Grammar in Telugu .

Thank you for reading this article English Grammar in Telugu . I Hope you liked it. Please Give feedback, comments and share this article.